చంద్రబాబు నాయుడు పై కత్తి మహేష్ తీవ్ర వ్యాఖ్యలు

Oneindia Telugu 2018-06-22

Views 428

Katti Mahesh, a film critic and has demanded for ruling power to Madiga community. On Thursday he has visited East Godavari district. On this occasion he speaking to the media, he said, In AP, the Chandrababu Government has been neglected for the 25 lakh Madiga people in the state.

సమాజ ఉద్ధరణలో భాగంగా మాదిగలకు రాజ్యాధికారం ఇవ్వాలని సినీ విమర్శుకుడు, రాజకీయ వ్యాఖ్యాత కత్తి మహేష్‌ డిమాండ్ చేశారు. గురువారం ఆయన తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజంలో సమన్యాయం వర్థిల్లాలంటే అణగారిన వర్గమైన మాదిగలకు రాజ్యధికారం ఇవ్వాలన్నారు. ఎపిలో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని 25 లక్షల మంది మాదిగల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. దళితులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిరక్షణకు సన్నద్ధం కావాల్సిన సమయం ఇదే అన్నారు.
గురువారం మధ్యాహ్నం స్పైస్‌జెట్‌ విమానంలో తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు విచ్చేసిన కత్తి మహేష్ కు ఎయిర్‌పోర్టులో స్థానిక దళిత నాయకుడు పెందుర్తి సునీల్‌ ఘన స్వాగతం పలికారు. తాను రాష్ట్ర పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చి, నాయకులతో చర్చించానని ఈ సందర్భంగా కత్తి మహేష్ చెప్పారు. పర్యటన అనంతరం ఆయన గురువారం రాత్రి మళ్లీ స్పైస్ జెట్ విమానంలోనే తిరిగి హైదరాబాద్ వెళ్లారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS