రజనీ..భగ్న ప్రేమికుడే ! ప్రేమ విషయం బయటపెట్టిన సూపర్ స్టార్..!

Filmibeat Telugu 2018-01-09

Views 600

Rajinikanth on his first love, evergreen style and nightlife with Kamal.

తొలిప్రేమ గుర్తులు ఎప్పుడూ ప్రత్యేకమే. ఏళ్ల తర్వాత మళ్లీ ఆ జ్ఞాపకాలను హత్తుకుంటున్నప్పుడు.. తెలియకుండానే పెదాలపై ఓ చిరునవ్వు మెరవడం సహజం. అలాంటి అనుభూతి తన జీవితంలోనూ ఉందని సూపర్ స్టార్ రజనీకాంత్ తొలిసారిగా ఆ విషయాన్ని బయటపెట్టారు.
'అవును నాకూ ఓ తొలి ప్రేమ ఉంది. కర్ణాటకలో హైస్కూల్లో చదివే రోజుల్లో ప్రేమలో పడ్డాను. ఎప్పటికీ అది మరిచిపోలేను. కొంతమంది ఆ ప్రేమను దక్కించుకుంటారు. మరికొంతమంది విఫలమవుతుంటారు. నేనూ విఫలమయ్యాను. ఇట్స్ ఏ ఫెయిల్యూర్..' అని తన తొలిప్రేమ గురించి చెప్పుకొచ్చారు రజనీ.
సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక స్కూటర్ లాంటి చిన్న చిన్న కోరికలు తీర్చుకోవాలన్న స్టేజీ నుంచి ఇంతదాకా ఎదిగిరావడం పట్ల రజనీ సంతోషం వ్యక్తం చేశారు. తమిళ ప్రజలకు చిరకాలం గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలనుందని చెప్పుకొచ్చారు.
నడిఘర్ సంఘ భవన నిర్మాణ నిమిత్తం నిధులు సేకరించే పనిలో పడ్డారు తమిళ నటీనటులు. ఇందుకోసం మలేషియా కేంద్రంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం కోసం రజనీకాంత్ కూడా వెళ్లారు. ఈ సందర్భంగా నటుడు వివేక్ రజనీకాంత్‌ను పలు విషయాలపై ప్రశ్నించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS