అజ్ఞాతం లో సూపర్ స్టార్ !

Filmibeat Telugu 2017-12-12

Views 203

Superstar Rajinikanth turns 67 today. The actor himself will stay away from the celebrations - spending the day out of town at a secret location.

సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు 67వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. అయితే పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయిన సూపర్ స్టార్ రహస్య ప్రదేశంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. తమ అభిమాన హీరోను కలిసేందుకు ఆయన నివాసానికి వస్తున్న పలువురు అభిమానులు నిరాశ చెందారు.
ఇటీవల తమిళనాడులో ఓఖి తుఫాను కారణంగా దాదాపు 500 మంది తమిళ జాలర్లు గల్లంతయ్యారు. 40 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఇలాంటి తరుణంలో పుట్టినరోజు సంబరాలు జరుపుకోవడానికి రజనీ ఇష్టపడటం లేదని, అందుకే రహస్య ప్రదేశంలోకి వెళ్లిపోయారని సన్నిహితులు అంటున్నారు.
తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రజనీకాంత్ మారువేషంలో బెంగుళూరుకు వెళ్లినట్లు సమాచారం. అక్కడే ఓ రహస్య ప్రదేశంలో ఆయన కొన్ని రోజుల పాటు ఉంటారని తెలుస్తోంది.
రజనీకాంత్‌ను కలిసి ఆయనకు విషెస్ చెప్పేందుకు భారీగా అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో పాటు ఆయనకు చెందిన చెన్నై కొడంబ్బాక్కంలోని రాఘేవంద్ర కళ్యాణమండపం వద్ద గుమిగూడారు. వేల సంఖ్యలో అభిమానులు అక్కడ గుమి కూడటంతో భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS