These days, We don't find all the heroes of Mega & Nandamuri Families in the same flexi because of some differences between both fan groups.
ఏపీలో చాలా కాలంగా కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య తీవ్ర అగాథం నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. విజయవాడలో కుల జాడ్యం ఎక్కువైందని, ముఖ్యంగా కమ్మ-కాపు సామాజిక వర్గాల మధ్య ఐక్యత లేకపోతే ఏపీ అభివృద్ది కష్టసాధ్యమని ఇటీవల పవన్ కల్యాణ్ కూడా వ్యాఖ్యానించారు.
పరిస్థితి చూస్తుంటే.. పవన్ చేసిన ఈ సూచన అక్కడివాళ్లను కదిలించినట్లుగానే కనిపిస్తోంది. రెండు సామాజిక వర్గాల మధ్య వైరం కన్నా మిత్రుత్వమే మంచిదన్న దిశగా వాళ్ల అడుగులు పడుతున్నాయేమో అనిపిస్తోంది. దానికి తాజా ఉదాహరణ ఇది..
జనవరి 10న పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదలకు ఒక్క రోజే సమయం ఉండటంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా అప్పుడే మొదలైంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా మాచర్లలోని రామా టాకీస్‌లో కొంతమంది అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆశ్చర్యంగా ఇందులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరుపున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కూడా ఉండటం విశేషం. పవన్, ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరుపున 'అజ్ఞాతవాసి'కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
గతంలో చాలాసార్లు పవన్ ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ అభిమానులకు మధ్య గొడవలు జరిగాయి. అలాంటిది ఉన్నట్టుండి ఈ ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే పవన్ ఇటీవల జనసేన మీటింగ్‌లో చేసిన కామెంట్స్ ఎఫెక్ట్ వల్లే ఈ ఐక్యత సాధ్యపడిందని అంటున్నారు.