Rajinikanth : తమిళ రాజకీయాలు చూసి నవ్వుతున్నారు, సొంతగానే పార్టీ పెడతా

Oneindia Telugu 2017-12-31

Views 1

Rajinikanth worry about Tamil Nadu Politics, says he will come with his new party.


రజనీకాంత్ ఓపెన్ అయిపోయారు. రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. ఎట్టకేలకు అభిమానులకు తీపి వార్త చెప్పారు. 6 వ రోజు సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని బట్టబయలు చేసారు. అయితే
ఈ సందర్భంగా రజనీకాంత్ మాటలాడారు.

రాజకీయాలు ఇప్పుడు బాగా చెడిపోయాయని రజనీకాంత్ చెప్పారు. కొన్ని జరుగుతున్న రాజకీయ పరిణామాలతో తమిళనాడు ప్రజలు తీవ్ర మనస్తాపంతో ఉన్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లోను నేను రాజకీయాల్లోకి రాకపోవడం సబబు కాదన్నారు. అన్ని రాష్ట్రాలు తమిళ రాజకీయాలు చూసి నవ్వుతున్నాయని, ఇలాంటప్పుడు తాను రావాల్సిందే అన్నారు. ఇలాంటప్పుడు రాకుంటే తాను ద్రోహం చేసినవాడిని అవుతానని చెప్పారు. యుద్ధం చేయకుంటే పిరికివాడు అంటారని రజనీకాంత్ అన్నారు. తాను సొంతగానే పార్టీ పెడతానని చెప్పారు. 234 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఇక గెలుపు, ఓటమి అంతా భగవంతుడికి వదిలేస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని చెప్పారు.


తనకు తమిళనాడు ప్రజలు అండగా నిలవాలని రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు. రాజకీయాలు అంటే అంత సులువు కాదని చెప్పారు. అధికారం అంటే సముద్రంలో మునిగి ముత్యాలు ఎత్తినంత కష్టమని చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS