Watch How Public Scolds Swathi. The woman and her lover had earlier harmed the husband and the leave the body in a forest.
నాగర్‌కర్నూల్ పట్టణంలో కాంట్రాక్టర్ సుధాకర్‌రెడ్డిని ప్రియుడు రాజేష్‌తో కలిసి భార్య స్వాతి హత్య చేసింది. భర్త స్థానంలో రాజేష్‌ను తీసుకురావాలని ప్లాన్ చేసింది. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్ వ్యవహరశైలితో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ కేసులో మిస్టరీ వీడింది. తరువాత స్వాతి, రాజేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో పూర్తి సాక్ష్యాధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. తాజాగా రెండు రోజుల పాటు స్వాతిని కస్టడీలోకి తీసుకొన్న పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించారు.
అయితే స్వాతిని నాగర్‌కర్నూల్ జైలుకు బస్ లో తరలిస్తుండగా బస్ లోని ప్రయాణికులు స్వాతిని దారుణంగా తిట్టారు. ఆమె తన ముఖానికి చున్నీ కట్టుకుని ఉంది. కాగా స్వాతి చేసిన పనికి చాలామంది ఆమె మీద కోపం గా ఉన్నారని ఈ వీడియోలో వాళ్ళ తిట్లు వింటే అర్దమవుతుంది. చెప్పలేని విధంగా స్వాతిని తిడుతున్నారు ఈ వీడియోలో.
అయితే స్వాతిని బస్ లో ఎందుకు తీసుకు వెళ్ళారనేది అర్దం కాకుండా ఉంది. సాదారనం గా పొలిసు వాహనంలోనే జైలుకు అయినా కస్టడి కి అయినా నేరస్తులను తీసుకెళతారు. మరి స్వాతిని బస్ లో తీసుకు వెళ్లడంపై సరైన ఇన్ఫర్మేషన్ లేదు.