టాలీవుడ్ టాక్ ఆఫ్ ది ఇయర్ అర్జున్ రెడ్డి నే !

Filmibeat Telugu 2017-12-19

Views 466

The industry grapevine has it that Tollywood's happening star, Vijay Devarakonda.

విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన హీరో. అంతకుముందు పెళ్లిచూపులు సినిమాలో పక్కా క్లాస్ అబ్బాయిలా కనిపించిన దేవరకొండను.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డిలో ఓ డైన మైట్‌లా పేల్చాడు. అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవరకొండ నటన థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా చాలామందిని వదల్లేదు. అంతలా ఆ క్యారెక్టర్ చాలామందిని వెంటాడింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయమైన విజయ్.. ఎవడే సుబ్రహ్మణ్యంలో భుజాన ఓ టేప్ రికార్డర్ వేసుకుని, అనూహ్యంగా సీన్ లోకి ఎంటరై చాలామందిని ఆశ్చర్యపరిచాడు.
ఆ తర్వాత వచ్చిన పెళ్లి చూపులుతో విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ జనాల చూపును కూడా తనవైపుకు తిప్పుకున్నాడు దేవరకొండ. ఏకంగా మణిరత్నం, శంకర్ లాంటి దిగ్గజ దర్శకులు కూడా దేవరకొండను తమ సినిమాల్లో నటింపజేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట గ్రామం విజయ్ దేవరకొండ స్వగ్రామం. తెలంగాణ వ్యక్తి కావడంతో సహజంగానే ఇంటర్వ్యూల్లోను, ఆడియో వేదికల్లోను తనదైన తెలంగాణ భాషనే మాట్లాడుతుంటాడు. విజయ్ మాట తీరు కూడా ఇప్పటికే చాలామందిని ఫిదా చేసింది.

Share This Video


Download

  
Report form