ప్రముఖ డైరెక్టర్ కు నో చెప్పిన అర్జున్ రెడ్డి !

Filmibeat Telugu 2017-12-18

Views 2.3K

oung and dynamic hero Vijay Devarakonda who made his debut as lead actor with ‘Pelli Choopulu’ became a happening actor with Arjun Reddy which was released a few months back.

టాలీవుడ్..బాలీవుడ్..హాలీవుడ్..ఇలా ఏ ఇండస్ట్రీ లో నైనా..ప్రతి నటుడు తన కెరీర్ లో ఏదైనా ఒక్క సినిమా మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉండాలని అనుకుంటాడు. చాలా మంది హీరోలు అలాంటి సినిమాల్లో అవకాశం దక్కించుకోవడానికి వారికి చాలా కాలమే పడుతుంది. ఒకవేళ అలాంటి సినిమా వచ్చింది అని తాను చెప్పుకొని నటించినా కూడా ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోతేనే ఆ సినిమాకి అసలైన విలువ. అలాంటి కథల కోసం మన టాలీవుడ్ హీరోలు చాలా ప్రయత్నాలు చేస్తూనే వున్నారు..కధ బావున్నా కుడా దానికి తగ్గ నటన కనబరిస్తేనే ఆ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది.
కానీ అతి తక్కువ కాలంలో మొదటి అడుగుల్లోనే లైఫ్ లాంగ్ గుర్తుండి పోయే హిట్ అందుకున్న హీరో..విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. స్టార్ హీరోల లెవల్లో హిట్ అందుకున్న విజయ్ ఇప్పుడు మంచి ఆఫర్స్ అందుకుంటున్నాడు. అంతే కాకుండా రీసెంట్ గా బాలీవుడ్ నుంచి కూడా మనోడు ఓ మూడు ఆఫర్స్ ను అందుకున్నాడు. అదికూడా ప్రముఖ యశ్ రాజ్ ఫిల్మ్ సంస్థ వారిది అవ్వగా.. దానిని వద్దనుకుంటున్నాడట.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS