Arjun Reddy Mania Again అర్జున్ రెడ్డి లుక్ లో

Filmibeat Telugu 2018-03-06

Views 507

Vikram son Dhruv stunning look in Arjun Reddy getup. Vikram shares photo in social media.

గత ఏడాది అర్జున్ రెడ్డి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చేసిన సందడి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో జాతీయ వ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా ఈ చిత్రం మారింది. బాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు ఈ చిత్ర రీమేక్ హక్కుల కోసం ఎగబడ్డారు. డెబ్యూ డైరెక్టర్ సందీప్ వంగ తొలి చిత్రంతోనే అద్భుతం చేసాడు. ఇప్పడు అతడితో సినిమా చేయడానికి టాలీవడ్ పెద్ద స్టార్లు ఆసక్తి చూపిస్తున్నారు. అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవర కొండా నటన ఆశ్చర్యపరిచింది.

ఈ చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టినా వాటన్నింటిని తట్టుకుని ఘనవిజయం సాధించడం విశేషం.ఈ చిత్రం సాధించిన విజయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు బాల ఈ చిత్రానికి తెరకెక్కిస్తున్నారు. వర్మ అనే టైటిల్ తో ఈ చిత్రం రాబోతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS