Gujarat election results : Is this really proper win for BJP, but BJP workers have already started celebrating as the party is maintaining a comfortable lead in Gujarat.
గుజరాత్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు ఒకింత నిజమవుతున్నాయి. క్షణక్షణానికి ఫలితాలు తారుమారు అయిన ఫలితాలు.. చివరగా బీజేపీని ఆధిక్యంలో నిలబెట్టాయి. బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీని ఇచ్చింది. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి లీడింగ్ మారింది. చివరలో బీజేపీ కూడా గట్టి పోటీని ఇచ్చింది. బీజేపీ కీలక నేతలు వెనుకంజలో కనిపించారు. తర్వాత పుంజుకున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఓ సమయంలో వెనుకబడ్డారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ చుక్కలు చూపించింది. పది గంటలసమయంలో బీజేపీ 103 స్థానాల్లో, కాంగ్రెస్ 78 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గతంలో కంటే బీజేపీకి పదిహేను సీట్లు తగ్గే అవకాశాలు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి పదిహేనుకు పైగా సీట్లు పెరిగేలా కనిపిస్తున్నాయి. చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ 110 నుంచి 120 స్థానాల మధ్య గెలుస్తుందని, కాంగ్రెస్ పార్టీకి 60 నుంచి 80 మధ్య సీట్లు వస్తాయని చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దాదాపు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. అయితే ఈ గెలుపు బీజేపీకి ఓ గెలుపు కాదని విశ్లేషకులు అంటున్నారు.