పెళ్లి తర్వాత పరిస్థితిపై సమంత !

Filmibeat Telugu 2017-12-13

Views 2.5K

Samantha revealed about the change in her life after marriage. She said she was taking care of the selection of stories.

సినిమాల్లో సక్సెస్ అయిన హీరోయిన్ సమంత.... ఇటు ప్రేమలో కూడా విజయం సాధించింది. తను ప్రేమించిన నాగ చైతన్యను వివాహం చేసుకుంది. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ ఫ్యామిలీ అక్కినేని కుటుంబంలోకి కోడలుగా వెళ్లింది. పెళ్లి తర్వాత సమంత ఎంతో సంతోషకరమైన జీవితం గడుపుతోంది. అయితే పెళ్లి తర్వాత కొన్ని విషయాల్లో మాత్రం మార్పు వచ్చిందని సమంత చెబుతోంది.
పెళ్లి తర్వాత స్వేచ్ఛను కోల్పోవాల్సిన అవసరం రాలేదని, అయితే తనలో చాదస్తం మాత్రం బాగా పెరిగిందని సమంత చెప్పుకొచ్చారు. పెళ్లికి ముందు కూడా నాలో చాదస్తం ఉండేది, కానీ పెళ్లి తర్వాత ఇది మరింత ఎక్కువైందని సమంత తెలిపారు.
పెళ్లికి ముందుతో పోల్చుకుంటే ఇపుడు కొన్ని రకాల కథలు నచ్చడం లేదని, బహుషా ఇది పెళ్లి ప్రభావం వల్లనే ఏమో అనే సందేహం సమంత వ్యక్తం చేశారు. మంచి సినిమాలు చేతిలో ఉండటం వల్లే నచ్చని కథలను వదిలేస్తున్నానని సమంత తెలిపారు.
ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. తెలుగులో ‘రంగస్థలం', ‘మహానటి', తమిళంలో ‘ఇరుబుతిరై', ‘సూపర్ డీలక్స్' చిత్రాల్లో సమంత నటిస్తున్నారు.
పెళ్లి తర్వాత సమంత తన కెరీర్ కు సంబంధించి మరో మెట్టు ఎక్కబోతున్నారు. నిర్మాతగా సినిమా చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు 'యూటర్న్' అనే కన్నడ సినిమా రైట్స్ కొనుగోలు చేసి దాన్ని తెలుగులో తీసేందుకు ప్లాన్ చేస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS