Samantha eye on 'U Turn' telugu remake. As per latest reports, Samantha recently visited Bengaluru, along with Naga Chaitanya, to watch a preview cut of the film. She had discussed the remake with the director at that time.
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత ఇటీవలే తన ప్రియుడు నాగ చైతన్యతో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని ముందే ప్రకటించిన సమంత పెళ్లికి ముందే కమిటైన పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. కాగా... పెళ్లి తర్వాత సమంత ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. నిర్మాతగా సినిమా చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు 'యూటర్న్' అనే కన్నడ సినిమాను రైట్స్ కొనుగోలు చేసి దాన్ని తెలుగులో తీసేందుకు ప్లాన్ చేస్తోంది.
కన్నడంలో చిన్న సినిమాగా విడుదలైన ‘యూటర్న్' అక్కడి బాక్సాఫీసు వద్ద పెద్ద విజయం సాధించింది. `యూటర్న్`ను తెలుగులో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా బాగా వర్కౌట్ అవుతుందని సమంత నమ్ముతుంది.
నిర్మాతగా మారాలనే సమంత ఆలోచనకు మామయ్య నాగార్జున సపోర్టు కూడా ఉంది. ‘యూటర్న్' చిత్రాన్ని తెలుగులో రూపొందిస్తే రిలీజ్ విషయంలో తన పూర్తి సహకారం ఉంటుందని నాగార్జున హామీ ఇచ్చారట.