World number 3 Sindhu has been clubbed along with number 2 ranked Akane Yamaguchi of Japan, Sayako Sato, also of Japan, and Bingjiao in Group A.
2016 రియో ఒలింపిక్స్ వెండి పతక గ్రహీత పీవీ సింధు 2017 సంవత్సరాన్ని విజయాలతో ముగించేందుకు చూస్తుంది. ఈ ప్రయత్నంలోనే పది లక్షల డాలర్ల దుబాయ్ సూపర్ సిరీస్‌ను గెలచుకునేందుకు సిద్ధమైంది. వరుస సిరీస్‌లు ఆడుతూ బిజీబిజీగా ఉన్న పీవీ సింధు ఈ ఏడాది ముగింపులో భారీ విజయాన్ని అందుకునే దిశగా అడుగులేస్తుంది. ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్ షిప్ లో వెండి పతక అందుకుంది. సూపర్ సిరీస్ రన్నర్ గా నిలిచింది. అక్టోబరు, నవంబరు నెలల్లో ఆడిన ఈ సిరీస్‌లతో విజయోత్సాహంలో ఉన్న సింధు మరో సిరీస్‌కు సిద్ధమైంది.
ప్రత్యర్థులు మాత్రం ఒలింపిక్ వెండి పతక విన్నర్ అనే విషయం దృష్టిలో ఉంచుకొని సిద్ధమౌతున్నారు. " ఈ ఏడాది నాకు బాగా జరిగింది. ఇదే స్థాయిలో ఈ సంవత్సారాన్ని ముగించనున్నాను. మొదటి రౌండ్ కష్టంగా ఉంటుందని అంచనా వేస్తున్నాను. నేనూ అదే స్థాయిలో సిద్ధంగా ఉన్నాను. నా ఆటకు 100శాతం కష్టం పెట్టి ఆడతాను. దుబాయ్ సిరీస్ ఫైనల్స్ కి వెళ్లేందుకు ప్రాక్టీస్ అయ్యాను. " అంటూ మీడియా సమావేశంలో ముచ్చటించింది. వచ్చే ఏడాది ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయని అడిగిన ప్రశ్నకి " నా ఆట తీరును బట్టి నా కోచ్ ఆ విషయాన్ని నిర్ణయిస్తారు. అన్నీ బాగుంటే ఈ ఏడాదిలానే వచ్చే సంవత్సరం కూడా ఉండాలని కోరుకుంటున్నాను." అని వెలిబుచ్చింది.