రంగస్థలం ఫస్ట్‌లుక్‌‌పై సాయి ధరమ్ తేజ్ ఏమన్నాడో తెలుసా ? | Filmibeat Telugu

Filmibeat Telugu 2017-12-09

Views 1.3K

The first to comment on the poster Rangasthalam 1985 was obviously another mega hero. An excited Sai Dharam Tej posted thus on his twitter handle.

మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న 'రంగస్థలం' ఫస్ట్‌లుక్‌ను మైత్రీ మూవీ మేకర్స్ శనివారం రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్‌లో హీరో రామ్ చరణ్ గెటప్ ఆకట్టుకునేలా ఉంది. మాస్ బాడీ లాంగ్వేజ్‌తో పక్కా పల్లెటూరి యువకుడిలా మెగా పవర్ స్టార్ కనిపించారు. ఫస్ట్ లుక్‌తోనే డైరెక్టర్ సుకుమార్ సినిమాపై అంచనాలు పెంచేశారు.
'రంగస్థలం 1985' సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకొంటోంది. చెర్రీ జాలీగా స్టెప్ వేస్తున్న స్టిల్‌ని ఫస్ట్‌లుక్‌గా వదిలింది చిత్రబృదం. టైటిల్‌ను పసుపు, ఆరెంజ్ కలర్స్‌తో చాలా చక్కగా డిజైన్ చేశారు. ఫుల్ మాస్ లుక్‌తో చెర్రీ అదరగొడుతున్నారు. ఇక సమంత లుక్ ఎలా ఉండబోతోందో చూడాలి.
సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమను వచ్చే ఏడాది మార్చి 30న విడుదల చేయనున్నట్లు ఫస్ట్‌లుక్ పోస్టర్‌‌లో ప్రకటించారు. ఈ సందర్భంగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చాలా ఆసక్తికరంగా ట్వీట్ చేశాడు. చెర్రీ ఫస్ట్‌లుక్‌ సాయి ధరమ్‌కి ఫుల్‌గా నచ్చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS