After Test against Sri Lanka, India captain Virat Kohli on Wednesday jumped three places to grab the second position among batsmen in the ICC Test rankings.
గురువారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్ధానానికి ఎగబాకాడు. శ్రీలంకతో మూడో టెస్టుకు ముందు కోహ్లీ ఐదో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేయడంతో కోహ్లీ 893 పాయింట్లతో మూడు స్ధానాలు ఎగబాకి రెండో స్ధానానికి కైవసం చేసుకున్నాడు.ఇక, రెండో స్ధానంలో ఉన్న పుజారా రెండు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచాడు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 938 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక శ్రీలంక టెస్టు కెప్టెన్ దినేశ్ చండీమాల్ తన కెరీర్‌లోనే తొలిసారి టాప్-10లో నిలిచాడు. ఢిల్లీ టెస్టులో చండీమాల్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే.
దీంతో 743 పాయింట్లతో దినేశ్ చండీమాల్ 8వ స్థానంలో నిలిచాడు. ఇక భారత క్రికెటర్లు మురళీ విజయ్(25), రోహిత్ శర్మ(40) తమ స్థానాలను మరింతగా మెరుగు పరుచుకున్నారు. కాగా, ఆసీస్‌కు చెందిన క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ 2005-06 డిసెంబర్-జనవరి మధ్య అన్ని ఫార్మాట్లలో నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు.