"హలో" స్టోరీ బయట పెట్టిన నాగ్ ! | Filmibeat Telugu

Filmibeat Telugu 2017-12-07

Views 2

Nagarjuna Gives Clarity On Hello Teaser Removed From Youtube. "This was a just miss communication." He said. And he also revealed hello movie story.

టాలీవుడ్ హీరోల్లో కింగ్ నాగార్జున చేసినట్టుగా మూవీ ప్రమోషన్స్ ఎవరు చేయలేరేమో. సినిమా కరెక్ట్ కంటెంట్ ని ముందే చెప్పేసి సినిమాపై అంచనాలు పెంచుతుంటారు నాగ్.. ఎక్కువగా పొగడ్తలకు పోకుండా హైప్ చేయకుండా చాలా ఈక్వల్ గా సింపుల్ గా సినిమా ప్రమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంటారు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ రెండవ సినిమా హలో ప్రమోషన్స్ ను కూడా నాగ్ అదే స్టైల్ లో కొనసాగిస్తున్నారు. తన చిన్న కొడుకు మూవీ ఈ సారైనా హిట్ కొడుతుందో లేదో అని లోలోపల టెన్షన్ ఉన్న ఈ సినిమా మీద చాలా నమ్మకం ఉందని చెప్పారు.
రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేసిన నాగార్జున హలో అసలైన స్టోరీని బయటపెట్టేశాడు. ఒక యంగ్ అబ్బాయి అమ్మాయి చిన్న తనంలో అనుకోని కారణాల వల్ల విడిపోతారట. అప్పుడు ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చి వెళుతుంది. దాదాపు 15 సంవత్సరాలుగా ఆ హీరో హీరోయిన్ ఇచ్చిన నెంబర్ కి కాల్ చేస్తూనే ఉంటాడట. కానీ ఆన్సర్ ఉండదట. అందుకే ఈ సినిమా కి హలో అనే టైటిల్ ను సెట్ చేశామని చెబుతూ.. సినిమా కథ మొత్తం ఒక్క రోజు జరిగే కథగా ఉంటుందని నాగ్ చెప్పేసాడు. ఈ కధ మధ్యలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS