Bunny Vasu FB post about Mahesh kathi. He advised to PK fans keep silent on Mahesh Kathi comments.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ విశ్లేషకులు కత్తి మహేష్ మధ్య ఆ మధ్య చాలా పెద్ద వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ కామెంట్స్ చేయడం, దానికి పవర్ స్టార్స్ తీవ్రంగా రియాక్ట్ అవ్వడంతో పెద్ద రచ్చ జరిగింది. పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా వైజాగ్ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో ఆయన్ను ఉద్దేశించి కత్తి మహేష్ మరోసారి కామెంట్స్ చేశారు.
‘పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘అజ్ఞాతవాసి' చిత్రం ఆడియో రిలీజ్ త్వరలో ఉంది. అలానే ఈ చిత్రం త్వరలోనే విడుదలవుతుంది. ‘ఏక్ పంత్ దో కాజ్' అంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు. అటు రాజకీయపరంగా లాభముంటుంది, ఇటు సినిమా పరంగా ప్రమోషన్ జరిగిపోతుంది... అని కత్తి మహేష్ వ్యాఖ్యానించారు.
కొత్తరక్తం, కొత్తతరహా రాజకీయాలు కావాలని పవన్ కళ్యాణ్ అన్న మాటలను ప్రస్తావిస్తూ 'పార్టీ ఆఫీసుని సినిమా ఆఫీసులా, ప్రజా ప్రస్థానాన్ని ఆడియో లాంచ్ లాగా మార్చడమే కొత్తతరహా రాజకీయం' అంటూ ఎద్దేవా చేశారు.
కత్తి మహేష్ కామెంట్స్ నేపథ్యంలో నిర్మాత బన్నీ వాసు స్పందించాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. "పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్... మార్కెట్ లో 'కత్తి'లు, 'సుత్తి'లు ఉంటాయి. వాటిని పట్టించుకోద్దు" అని పోస్టు చేశారు.