The Election Commission first rejected Vishal's nomination, as one of the proposers had said they had not proposed Vishal but their names were included in the actor's nomination paper.
ఆర్కే నగర్ ఉపఎన్నికల నామినేషన్ ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంది. నటుడు విశాల్ నామినేషన్‌ను మొదట తిరస్కరించిన ఎన్నికల సంఘం.. ఆ తర్వాత ఆమోదం తెలిపింది. ఆ తర్వాత గంటల్లోనే విశాల్ నామినేషన్ ను అధికారికంగా తిరస్కరిస్తున్నట్లు ఈసీ ప్రకటించడం గమనార్హం. విశాల్ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వేలుస్వామి ప్రకటించారు. నామినేషన్ పత్రాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం ఈ ప్రకటన చేశారు.
అంతకుముందు ఈసీ తన నామినేషన్ ను స్వీకరించడంతో 'సుదీర్ఘ పోరాటం తర్వాత ఆర్కేనగర్ ఎన్నికలకు సంబంధించిన నా నామినేషన్‌కు ఆమోదముద్ర పడింది. సత్యం జయించింది' అంటూ విశాల్ వెల్లడించారు. తొలుత విశాల్ సమర్పించిన నామినేషన్ పత్రాలు అసంపూర్తిగా ఉన్నాయని, అందుకే తిరస్కరించామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు.