Film actor vishal may contest in RK Nagar by poll.
తమిళనాడు రాష్ట్రంలోని ఆర్‌కె నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో సినీ నటుడు విశాల్ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఆర్‌కె నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలోనే ఈ స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. అయితే ఆ సమయంలో విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు చేశారని ఆరోపణలు రావడంతో ఎన్నికలను వాయిదా వేశారు.ప్రస్తుతం ఈ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆర్‌కె నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక విషయమై ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే రంగంలోకి దిగారు. డిఎంకె, అన్నాడిఎంకె అభ్యర్థులతో పాటు, శశికళ వర్గానికి చెందిన దినకరన్ కూడ ఈ స్థానం నుండి ఎన్నికల బరిలోకి దిగారు.
తమిళనాడు సినీ నటుడు విశాల్ కొత్త పార్టీని కూడ పెట్టే అవకాశాలు కూడ ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. 2021 ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసేందుకు విశాల్ పార్టీని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయాలపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే రజనీకాంత్, కమల్‌హసన్ కూడ కొత్త పార్టీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో విశాల్ పార్టీ ఏర్పాటు చేసే అంశం తెరమీదికి రావడం సంచలనం రేపుతోంది.