An AIADMK MLA has been caught on camera distributing money and liquor to party cadres. MLA Kanakaraj is seen in the video purportedly distributing money to cadres ahead of the MG Ramachandran birth centenary celebrations
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే మద్యం, డబ్బు పంచిపెడుతూ అడ్డంగా బుక్కయిపోయా డు. డబ్బు, మద్యం పంపిణి చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే కనకరాజ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలను కోయంబత్తూరులో అన్నాడీఎంకే పార్టీ ఆదివారం ఘనంగా నిర్వహించింది. ఎంజీఆర్ శత జయంతి వేడుకలకు జనాలను సమీకరించేందుకు అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే ఆర్. కనకరాజ్ భారీ మొత్తంలో మద్యం, డబ్బు పంచిపెట్టారని ఆరోపణలు వస్తున్నాయి.
ఎంజీఆర్ శత జయంతి వేడుకల కార్యక్రమానికి దాదాపు 70 బస్సుల్లో ఆయన స్థానిక ప్రజలను తరలించారని సమాచారం. ఆక్రమంలో తీసిన ఓ వీడియో ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది. కుర్చీలో కుర్చున్న ఎమ్మెల్యే కనకరాజ్ రూ. 2 వేల నోట్లు లెక్కడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.