Groom Beats Bride Mercilessly On First Night, Got Suspended

Oneindia Telugu 2017-12-04

Views 2

Bride was beated mercilessly by her groom on their wedding night in Chittoor district.

సంచలనం రేపిన శాడిస్ట్ భర్త రాజేష్ ఘటనపై చిత్తూరు జిల్లా విద్యా శాఖ స్పందించింది. వి.కోటలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పని చేస్తున్న రాజేష్‌ను సస్పెండ్ చేశారు. పెళ్లైన తొలి రాత్రి రాజేష్ తన భార్యను రాక్షసంగా వేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజేష్‌ను విధుల నుంచి తప్పిస్తూ డీఈవో ఆదేశాలు జారీ చేశారు. రాజేష్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. విచారణలో ఆయన పలు విషయాలు వెల్లడిస్తున్నాడని తెలుస్తోంది. గంగాధరనెల్లూరు మండలం చిన్నదామరగుంటలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
మోతరంగనపల్లెకు చెందిన కుమారస్వామిరెడ్డి తనయుడు రాజేష్‌ కుప్పం మండలంలో ప్రభుత్వ టీచర్. చిన్నదామరకుంటకు చెందిన బాబురెడ్డి కుమార్తె శైలజ(ఎంబీఏ)ను ఇచ్చి శుక్రవారం ఘనంగా వివాహం జరిపించారు.తొలి రాత్రిని అత్తగారింట ఏర్పాటు చేయగా అది అనుకున్నట్లుగా జరగకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీనిని అవమానంగా భావించిన భర్త.. భార్యపై దాడికి పాల్పడ్డాడు. శైలజ తీవ్రగాయాలతో రోదిస్తూ గది నుంచి బయటకు వచ్చింది. భర్త దారుణంగా హింసించినట్లు తల్లిదండ్రులకు తెలిపింది. వారి సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Share This Video


Download

  
Report form