Virat Kohli says Youngsters need to take to Test cricket for it to survive, not only in our country but globally.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టులపై తనకున్న అభిమానాన్ని మరోసారి ప్రదర్శించాడు. సంప్రదాయ టెస్టు క్రికెట్‌తోనే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను కాపాడుకోగల్గుతామని విరాట్ కోహ్లీ అన్నాడు. ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దిగ్గజ క్రికెటర్లు, ఢిల్లీ మాజీ కెపెన్లు బిషాన్‌సింగ్ బేడీ, మొహిందర్ అమర్‌నాథ్, వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నా దృష్టిలో టెస్టు క్రికెట్టే అత్యుత్తమ ఫార్మాట్. క్రికెట్‌లో టెస్టు ఫార్మాట్ స్థానం అగ్రస్థానంలో ఉండాలి. అప్పుడే ఈ ఆటకు ఢోకా ఉండదు. టెస్టులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టమని ఈతరం కుర్రాళ్లకు నా సలహా' అని కోహ్లి అన్నాడు. గతంలో ఢిల్లీ జట్టుకు ఆడిన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు.నేను అండర్-14, అండర్-16 మ్యాచ్‌లు ఆడిన సమయంలో బేడీ సర్ కోచ్‌గా ఉన్నారు. అప్పట్లో ఆయన శిక్షణ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు అనిపించేది. అతనిచ్చిన విలువైన సలహాలు, సూచనలు నా క్రికెట్ జీవితంలో భాగమయ్యాయి. ఇప్పుడు అదే నా జీవితంలో భాగంగా మారిపోయింది. ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించిన కెప్లెన్లతో కలిసి వేదిక పంచుకోవడం గర్వంగా భావిస్తున్నా' అని కోహ్లీ తెలిపాడు.