Ivanka Trump at Golkonda Fort | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-29

Views 3.3K

Ivanka Trump, daughter and adviser of US President Donald Trump, will visit the historic Golkonda Fort along with a delegation of senior officials on Wednesday afternoon before wrapping up her two-day India visit.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్‌ బుధవారం సాయంత్రం గోల్కొండ కోటకు చేరుకున్నారు. భారీ భద్రత నడుమ గోల్కొండ కోటను ఆమె సందర్శిస్తున్నారు. దీంతో పోలీసులు గోల్కొండ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. నగరంలో మంగళవారం ప్రారంభమైన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు ఇవాంకా వచ్చిన విషయం తెలిసిందే.
కాగా, బుధవారం ఉదయం నుంచే సందర్శకులను లోనికి అనుమతించడం లేదు. అమెరికా ఎంబసీ అధికారులు కోటకు చేరుకుని డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అదనపు సీపీ స్వాతిలక్రా, డీసీపీ వెంకటేశ్వరరావు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా ఏర్పాట్లను పరిశీలించారు. జీఈఎస్‌ సదస్సుకు వచ్చిన 1500 మంది ప్రతినిధులకు తెలంగాణ ప్రభుత్వం రాత్రికి గోల్కొండ కోటలో విందు ఇవ్వనున్న విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form