In Kanyakumari, a cop was caught lath charging a biker for not wearing helmet. After the incident took place, there has been a huge uproar over the act of Tamil Nadu policeman and every citizen has criticized him for the inhumane act.
తమిళనాడు పోలీసులు మరోసారి తమ ప్రతాపం చూపించారు. హెల్మెట్ పెట్టుకోకపోతే రూ. 200 అపరాదరుసుం విధించాలి. లేదంటే కేసు నమోదు చెయ్యాలి. అంతే కాని చేతిలో లాఠీ ఉంది కదా అంటూ ఓ పోలీసు అధికారి రెచ్చిపోయాడు. ఏఎస్ఐ లాఠీతో అమాయకుడైన యువకుడి తల పగలగొట్టారు. తమిళనాడులో ప్రసిధి చెందిన పర్యటక కేంద్రం కన్యాకుమారి జిల్లాలో ఈ సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. కన్యాకుమారి జిల్లా తిరువట్టారు పోలీస్ స్టేషన్ లో ఏఎస్‌ఐగా పని చేస్తున్న దేవరాజ్ స్థానికంగా ప్రతి రోజూ వాహనాల తనిఖీలు చేస్తుంటారు. శుక్రవారం వాహనాల తనిఖీల్లో నిమగ్నమయ్యారు.
ఆ సందర్బంలో అటు వైపు ఇద్దరు యువకులు హెల్మెట్ లేకుండా బైక్ లో వెళ్లారు. హెల్మెట్ లేకుండా వెలుతున్న వారిని ఏఎస్ఐ దేవరాజ్ అడ్డుకునేందేకు ప్రయత్నం చేశాడు. బైక్ లో వెలుతున్న యువకులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన ఏఎస్ఐ దేవరాజ్ తన లాఠీకి పని చెప్పాడు. యువకులు వెలుతున్న బైక్‌ను వెంబడించి వారి తల మీద లాఠీతో దాడి చేశారు. ఆ సందర్బంలో బైక్ లో వెనుక కూర్చున్న రాకేష్ అనే యువకుడి తలను లాఠీతో పగలకొట్టాడు.