Director Ram Gopal Varma compares Ivanka Trump with Sunny Leone, He says I can get to see her awesome figure in real.
నవంబర్ 28న హైదరాబాద్‌లో జరగబోయే గ్లోబల్ ఎంట్రాప్రెన్యూర్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు త్వరలో ఇవాంకా హైదరాబాద్‌లో పర్యటించనున్నసంగతి తెలిసిందే. ఇవాంకా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో ఆమెను సన్నీలియోన్‌తో పోలుస్తూ వర్మ కామెంట్లు గుప్పించాడు. ఇవాంకాను బాలీవుడ్ నటి సన్నీలియోన్‌తో పోలుస్తూ.. వర్మ ఫేస్‌బుక్‌లో ఓ కామెంట్ పోస్ట్ చేశాడు.
నాకు రాజకీయాలపై ఎంతమాత్రం అవగాహన లేదు. అందులో నాకు జ్ఞానం కూడా లేదు. అసలు ఇవాంకా హైదరాబాద్‌లో పర్యటించడానికి గల ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. కానీ, నేను మాత్రం ఇవాంకా రియల్ అందమైన ముఖాన్ని చూడాలని ఎంతోగానూ ఎదురుచూస్తున్నాను.
గతంలో భారత్‌కు శృంగార తార సన్నీలియోన్ వచ్చినప్పుడు కూడా నేను ఇలాగే చాలా పులకరించిపోయాను' అంటూ వర్మ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇదిలా ఉండగా, ఈనెల 28న హైదరాబాద్‌లో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్‌కు ఇవాంక హాజరు కానున్న సందర్భంగా భారీ వ్యయంతో హైదరాబాద్‌ను జీహెచ్ఎంసీ ముస్తాబు చేస్తోంది.