NASA predicts This city will flood first due to melting ice | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-17

Views 569

Mangalore in Karnataka is at a higher risk of flooding from rising sea levels because of melting glaciers than coastal cities such as Mumbai and New York, data released by Nasa shows.

గ్రీన్‌లాండ్‌, అంటార్కిటికాలో మంచు ఫలకాలు కరిగిపోతే న్యూయార్క్‌, లండన్‌, ముంబై లాంటి మహానగరాలకు వాటిల్లే ముప్పు కంటే కర్ణాటక రాష్ట్రంలోని మంగళూర్‌కే ముంపు తీవ్రత ఎక్కువగా ఉంటుందట.
ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. గ్రెడియంట్‌ ఫింగర్‌ప్రింట్‌ మ్యాపింగ్‌(జీఎఫ్‌ఎం) పేరిట ఈ మధ్యే నాసా ఓ కొత్త పరికరాన్ని కనిపెట్టింది. దాని ద్వారా ప్రపంచంలోని ఏయే ప్రాంతాల్లో ముంపు ప్రభావం ఎక్కువగా ఉండబోతుందో అంచనా వేస్తోంది.సుమారు 293 పోర్టు పట్ణణాలను పరిశోధించిన నాసా ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. గ్రీన్‌ లాండ్‌ ఉత్తరాది, తూర్పు వైపున ఉన్న మంచుపొరలు కరిగిపోయి న్యూయార్క్ పట్టణానికి ఏర్పడే ప్రమాదం కన్నా... మంగళూరుకు ఏర్పడే ముప్పు ఎక్కువగా ఉందని నాసా పరిశోధనలో తేలింది.
గ్లోబల్‌ వార్మింగ్‌ మూలంగా ధ్రువాలలోని మంచు ఫలకాలు కరిగిపోయి తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని చాలాకాలంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. వాయవ్య గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు ఫలకాలు కరగటం వల్ల లండన్‌ సముద్ర మట్టం పెరుగుతుందని శాస్త్రవేత్త ఎరిక్‌ ఇవాన్‌ చెప్పారు.

Share This Video


Download

  
Report form