Iran-Iraq Earthquake Update ఇరాన్-ఇరాక్ లో భారీ భూకంపం

Oneindia Telugu 2017-11-13

Views 605

A massive earthquake of magnitude 7.3 struck Iraq on Sunday, 103 kms (64 miles) southeast of the city of As-Sulaymaniyah, the US Geological Survey said. US Geological Survey initially said the quake was of a magnitude 7.2, before revising it to 7.3.

ఇరాక్ - ఇరాక్ సరిహద్దుల్లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో140 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.3గా నమోదైంది. ఈశాన్య, పశ్చిమ ఇరాక్‌లో భూకంప తీవ్రత కనిపించింది. ఈ భూకంపం కారణంగా పలు ఇరాన్ నగరాలు, ఎనిమిది గ్రామాలు దెబ్బతిన్నాయి.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు రోడ్లపైనే బయంతో గడుపుతున్నారు. ఇక ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఇరాన్‌-ఇరాక్‌కి చెందిన నగరాల్లో విద్యుత్‌ నిలిపివేశారు. ఓ పక్క భూప్రకంపనలు మరోపక్క చల్లటి వాతావరణంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది’, సహాయ కార్యక్రమాలకు విరిగిపడుతున్న మట్టిపెళ్లలు ఆటంకం కలిగిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక భూమికి 33.9 కిలోమీటర్ల లోపల భూకంపం సంభవించగా.. దాని ప్రకంపనలు టర్కీ, ఇజ్రాయెల్, కువైట్‌లనూ తాకాయి అని సమాచారం.
శిథిలాల కింద చాలామంది చిక్కుకుపోయారని, సహాయక కార్యక్రమాలు పూర్తయితే కానీ పూర్తి వివరాలు అందుబాటులోకి రావని అధికారులు అంటున్నారు. కాగా భూకంపం ముప్పు పూర్తిగా తొలగిపోలేదని, ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS