Face Care And Beauty Tips For Men మ‌గ‌వారి ముఖ సౌంద‌ర్యానికి 5 సింపుల్ చిట్కాలు

Oneindia Telugu 2017-11-11

Views 1

Face Care Tips For Men : How Men Should Take Care Of Their Face Here are 5 simple face care tips that men should follow every day

మ‌గువ‌లు ఎలా అయితే త‌మ మొహాన్ని అందంగా సంరక్షించుకుంటారో అదే విధంగా మ‌గ‌వాళ్లు త‌మ ముఖ సౌంద‌ర్యంపై దృష్టిసారించాలి. అయితే ఇదంతా చాలా స‌మ‌యాన్ని తినే వ్య‌వ‌హ‌రంగా భావించి నిర్ల‌క్ష్యం చేసేస్తున్నారు కొందరు. మ‌ళ్లీ వీళ్లే మొహంపై ఒక్క మ‌చ్చ‌, గాటు, మొటిమ క‌నిపిస్తే చాలు ల‌బోదిబోమంటూ మొత్తుకుంటారు. మొహాన్ని సంర‌క్షించే విధానం ఒక్క రోజులో జ‌రిగే ప‌ని కాదు. తాజా కాంతివంత‌మైన ఆరోగ్య‌క‌ర ముఖ వ‌ర్చ‌స్సు కోసం ప్ర‌తి రోజు మొహన్ని సంర‌క్షిస్తుండాలి.
రోజు మొహాన్ని శుభ్రంగా ఉంచుకోవ‌డం వ‌ల్ల మొటిమ‌లు, ర్యాషెస్ ఏర్ప‌డ‌కుండా ఉంటాయి. స‌రైన పోష‌కాలు అందుతుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
1. స‌రైన ముఖ సంర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల ఎంపిక‌ :
మ‌గ‌వాళ్లు మొహానికి సంబంధించి క్లెన్స‌ర్‌, స్క్ర‌బ్బ‌ర్‌, మాయిశ్చ‌రైజ‌ర్ లాంటివెన్నో వాడ‌వ‌చ్చు. అయితే వీటిల్లో ఆల్క‌హాల్‌, డై, హానిక‌ర ప‌రిమ‌ళాలు లాంటివెన్నో ఉండ‌వ‌చ్చు. ఇలాంటివి లేని ఉత్ప‌త్తుల‌ను ఎంచుకోవ‌డం మంచిది. రెండు ఉత్ప‌త్తుల‌ను మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వాడ‌కూడ‌దు. అవి ఆఫ్ట‌ర్ షేవ్ మ‌రొక‌టి ఫోమ్ ఉన్న షేవింగ్ క్రీమ్‌. ఆఫ్ట‌ర్ షేవ్ లోష‌న్‌లో గాఢ‌మైన ప‌రిమ‌ళాలుంటాయి. అవి చ‌ర్మానికి హాని చేస్తాయి. ఇక ఫోమ్ ఉన్న షేవింగ్ క్రీమ్ బాహ్యా చ‌ర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే హానికార‌క కెమికల్స్ ఉన్న‌వాటికి దూరంగా ఉండాలి.
2. మ‌గవారికి ప్ర‌త్యేక‌మైన‌వే...
చాలా మంది మ‌గ‌వాళ్ల‌కి చర్మ సంర‌క్ష‌ణ అన‌గానే అమ్మాయిలు వాడే ర‌క‌ర‌కాల క్రీములు, టోన‌ర్లు, మాయిశ్చ‌రైజ‌ర్లు వాడాల‌ని చూస్తుంటారు. ఇది చ‌ర్మంపై ప్ర‌భావం చూపించ‌గ‌ల‌దు. అమ్మాయిల కోసం రూపొందించిన కాస్మొటిక్స్ వాళ్ల కోస‌మే ఉద్దేశించిందై ఉంటుంది. అది మీ చ‌ర్మానికి స‌రిపడ‌క‌పోవ‌చ్చు. స్కిన్ అల‌ర్జీలు వ‌చ్చినా రావ‌చ్చు. కాబ‌ట్టి మ‌గ‌వారికోస‌మే ప్ర‌త్యేక‌మైన చ‌ర్మ సౌంద‌ర్య ఉత్ప‌త్తులను వాడ‌డం మంచిది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS