Yuvraj Singh Should Be Back : No Yo-Yo Test | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-11

Views 102

Former Indian skipper Mohammad Azharuddin, is of the opinion that such duo's talent alone should give them the exemption from passing the high-intensity fitness test.

అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించినా.. రాణించకున్నా కొంతమంది ఆటగాళ్లకు మాజీల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. అలాంటి క్రికెటర్లలో టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒకడు. తాజాగా యువరాజ్‌కు జట్టులో చోటు కల్పించాలనే వారి జాబితాలో అజహరుద్దీన్‌ చేరాడు. యో-యో టెస్టుతో సంబంధం లేకుండా యువరాజ్‌ని జట్టులోకి ఎంపిక చేయాలని సెలక్టర్లను అజహరుద్దీన్ కోరాడు. యువీ తప్పకుండా పునరాగమనం చేస్తారని ధీమా కూడా వ్యక్తం చేశాడు. దుబాయిలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా అజహరుద్దీన్‌ మీడియాతో మాట్లాడాడు.
'యో-యో పరీక్షేంటో నాకు తెలీదు. యువీ మాత్రం కచ్చితంగా ఇండియన్ టీమ్‌లోకి రావాల్సిందే' అని అజహరుద్దీన్‌ అన్నాడు. ఫిట్‌నెస్ విషయానికి వస్తే మాత్రం అందరూ ఫిట్‌గా ఉండాలి. ఫిట్‌గా లేకపోతే ఆడటం కష్టమే. కొందరు ప్లేయర్స్ తమ కెరీర్ చివరి దశలో ఉన్నా ఇంకా చాలా బాగానే ఆడుతున్నారు' అని అజహరుద్దీన్‌ అన్నాడు.

Share This Video


Download

  
Report form