Jasprit Bumrah and Yuzvendra Chahal Ready For Test Cricket | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-09

Views 599

Speaking highly of both the Indian bowlers, former India captain Sunil Gavaskar said, "They were fantastic. They had brought all their IPL experience into play, they know exactly where to bowl, to which batsman what line to bowl, what deliveries to bowl and yes, there will be that odd over when they will go for runs but they come so strongly.
టీమిండియా యువ బౌలర్లు జస్ప్రీత్‌ బుమ్రా, యజ్వేంద్ర చాహల్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. న్యూజిలాండ్‌తో ముగిసిన టీ20 సిరిస్‌లో వీరిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారని పొగడ్తల్లో ముంచెత్తాడు. బుధవారం గవాస్కర్ మీడియాతో మాట్లాడుతూ బుమ్రా, యజువేంద్ర చాహల్‌లు టెస్టులు ఆడేందుకు అర్హులని తెలిపాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లో ఆడిన అనుభవం వారికి బాగా కలిసొచ్చిందని, వారిని పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. 'కివీస్‌తో చివరి టీ20లో బుమ్రా, చాహల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఐపీఎల్‌ అనుభవాన్ని వారు ఇక్కడ చూపించారు. వారిని టెస్టు మ్యాచ్‌లకు కూడా పరిగణనలోకి తీసుకోవాలి' అని అన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS