Commuters had a tough time to reach their destinations as visibility was dropped to very low on Tuesday morning. A thick layer of smog engulfed the national capital with pollution level remaining critical. The Air Quality Index (AQI) in major parts of the city hovered from poor to very poor.
ఢిల్లీలో పరిస్థితి మారడం లేదు. కాలుష్యం స్థాయిలు ఏమాత్రం తగ్గడం లేదు. బుధవారం ఉదయం కూడా ఢిల్లీలో కాలుష్య స్థాయి ప్రమాదకరంగా ఉండటంతో నేడు జరగాల్సిన హాఫ్ మారథాన్ ను సైతం రద్దు చేశారు. ఇరుగు, పొరుగు రాష్ట్రాల్లో వ్యవసాయ చెత్తను తగులబెడుతూ ఉండటంతో ఏర్పడిన వాయు కాలుష్యం ఢిల్లీ నగరాన్ని ముంచెత్తుతోంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఆస్తమా తదితర శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఇప్పుడున్న గాలి పీలిస్తే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.