Actress Vani Viswanath on Monday fired at YSR Congress Party chief YS Jaganmohan Reddy for his Padayatra.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తన ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్న నటి వాణీ విశ్వనాథ్ కూడా జగన్ పాదయాత్రపై నిప్పులు చెరిగారు. జగన్ మైండ్ సెట్ మారలేదని, పాదయాత్ర తొలి రోజే వ్యక్తిగత దూషణకు దిగాడని, ఇక నుంచి డయల్ 1100ను ప్రతిపక్షంగా భావిద్దామని చంద్రబాబు అన్నారు.
పరిష్కార వేదిక డయల్ 1100నే ప్రతిపక్షంగా పరిగణించి, ఆ విభాగానికి ప్రజలు చేసే ఫిర్యాదులు, చెప్పే అభిప్రాయాలపైన అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని చంద్రబాబు చెప్పారు. ప్రతిపక్ష వైసిపి లేదని అసెంబ్లీ సమావేశాలను తేలిగ్గా తీసుకోవొద్దని, మరింత సజావుగా సభ జరగాలని, మంత్రులు ప్రతి ప్రశ్నకు, చర్చకు బాగా సన్నద్ధమై వచ్చి సమాధానామివ్వాలన్నారు.