YS Jagan Padayatra : కిక్కిరిసిపోయిన ఇడుపులపాయ | Oneinda Telugu

Oneindia Telugu 2017-11-06

Views 1.3K

YSR Congress Party chief YS Jaganmohan reddy started his 3000 Kilo Meter long Padyatara in from Idupulapaya in Kadapa district on Monday.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సోమవారం ఉదయం ప్రారంభమైంది. అంతకుముందు వైయస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఇడుపులపాయలోని వైయస్ ఘాట్ వద్ద ఉదయం జగన్ నివాళులు అర్పించారు. జగన్‌తో పాటు ఆయన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, సోదరి షర్మిలలు ఉన్నారు. వారు జగన్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొన్నారు. వైయస్ ఘాట్‌కు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. పెద్ద ఎత్తున జనాలు తరలి రావడంతో ఇడుపులపాయ కిక్కిరిసిపోయింది. పాదయాత్ర ప్రారంభం సమయంలో జగన్ ఇడుపులపాయలో భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తొలుత రోజా, కొడాలి నాని, ధర్మాన ప్రసాద రావు తదితర నేతలు మాట్లాడారు. అనంతరం జగన్ ప్రసంగించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS