Mohammed Siraj Got Emotional Ahead Ff India Vs New Zealand 2nd T20

Oneindia Telugu 2017-11-06

Views 244

Siraj's dream finally came true when he was handed the international cap by Team India coach Ravi Shastri ahead of the second T20I match against New Zealand in Rajkot.Just after the national anthem, Siraj got emotional and was seen in tears.
గత ఏడాది ఐపీఎల్‌తోనే స్టార్ క్రికెటర్‌గా మారిన హైదరాబాదీ యువకుడు మహ్మద్ సిరాజ్. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మ్యాచ్‌కు ముందు హెడ్ కోచ్ రవిశాస్త్రి చేతుల మీదుగా సిరాజ్ క్యాప్ అందుకున్నాడు. ఈ సందర్భంగా సిరాజ్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టాడు.
మరోవైపు, తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ సిరాజ్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చింది. భయపడుతూనే బౌలింగ్‌ను స్టార్ట్ చేశాడు. తొలి ఓవర్ తొలి బంతికే ఫోర్ ఇచ్చాడు. మొత్తం నాలుగు ఓవర్లలో ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే మూడో ఓవర్ రెండో బంతికి కివీస్ కెప్టెన్ విలియంసన్‌ను పెవిలియన్‌కు చేర్చడం సిరాజ్ కు కాస్త ఊరట. ఈ మ్యాచ్‌లో భారత్ 40 పరుగుల తేడాతో ఓడిపోయింది.
సిరాజ్ పలు సందర్భాల్లో భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్‌కు ముందు కోచ్‌ రవిశాస్త్రి నీలంరంగు టోపీ అందించినప్పుడు, సహచరులు అభినందనలు తెలియజేసినప్పుడు, జాతీయగీతం ఆలపిస్తున్నప్పుడు, తొలి ఓవర్‌ వేస్తున్నప్పడు సిరాజ్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

Share This Video


Download

  
Report form