Virat Kohli opened up frankly about his retirement in a web-talk show ‘Breakfast with Champions’. “The motivation is just about winning. The day the passion ends, I will stop playing. I’ll never want to drag myself for more than my body can take”, he said.
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఎప్పుడు ప్రకటించాలనే దానిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టత ఇచ్చాడు. ఆదివారం(నవంబర్ 5) తన 29వ పుట్టినరోజు జరుపుకోనున్న విరాట్ కోహ్లీ 'బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' అనే వెబ్ టాక్ షో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించాడు. 'గెలుపొందడమే నాకు స్ఫూర్తి. ఆటపై ఆసక్తి తగ్గిపోయిన మరుక్షణమే క్రికెట్ ఆడటం ఆపేస్తా. నా శరీరం సహకరించిన అన్ని రోజులు ఆటన ఆస్వాదిస్తా. ఇక ఆడలేను అనుకున్న తరుణంలో వీడ్కోలు చెప్పేస్తాట' అని కోహ్లీ అన్నాడు.
'ఆటపై ఇష్టం లేకుండా లేచిన రోజులు చాలా ఉన్నాయి. పట్టుదలగా ఆడి దాన్ని అధిగమించా. మనకు వెన్నుతట్టి ప్రోత్సహించే వారుంటే అపజయాల భారం తగ్గుతుంది. మళ్లీ గెలిచేందుకు ప్రయత్నించాలని అనిపిస్తుంది. క్రీడాకారులు ఇది చాలా అవసరం. ఆట ఉత్కంఠగా ఉన్నప్పుడు ఇష్టం లేకుండా బరిలోకి దిగాల్సి వస్తే ఆ రోజు క్రికెట్ కు గుడ్ బై చెబుతా' అని కోహ్లీ అన్నాడు.