తారక్, త్రివిక్రమ్ మధ్య చిచ్చు.. : మూవీ ఉన్నట్టా లేనట్టా ?

Filmibeat Telugu 2017-11-04

Views 3.1K

Young Tiger NTR started a movie with Trivikram Srinivas recenly. But this movie in doldrum according to reports. Keeping Trivikram story aside, NTR looking for another project with Dil Raju. That movie is going to direct by Satish Vegnesh, Whichi gives superhit last Sankranti.
జై లవకుశతో జోష్ మీద ఉన్న ఎన్టీఆర్, వరుస విజయాలతో దూసుకెళ్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా అనగానే ఇది రేర్ కాంబినేషన్ అనే మాట సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ముహూర్తంగా షాట్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా జరగడంతో మరింత క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత ఈ చిత్రం ముందుకెళ్లే అవకాశం లేదనే నిరాధారమైన వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ మరో కథపై దృష్టిపెడుతున్నారని వచ్చిన వార్త అందుకు బలం చేకూర్చే విధంగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
త్రివిక్రమ్, ఎన్టీఆర్ మధ్య విభేదాలు చోటుచేసుకోవడానికి ప్రధాన కారణం నటీనటుల ఎంపిక అనే మాట వినిపిస్తున్నది. ఈ చిత్రంలో కీలకపాత్ర కోసం సీనియర్ నటి టబును ఎంపిక చేయడం ఎన్టీఆర్‌కు నచ్చలేదనేది ఆ గాసిప్ సారాంశం.
సీనియర్ నటి ఎంపిక వివాదం కొనసాగుతుండగానే మరో వార్త మీడియాలో వెలుగు చూసింది. త్రివిక్రమ్ సినిమాను పక్కన పెట్టి తారక్ మరో కథ కోసం ఎదురుచూస్తున్నాడన్న విషయాన్ని కథనంలో పేర్కొన్నారు.అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో సినిమా పనుల్లో బిజీగా ఉన్నందున ఎన్టీఆర్ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తున్నది. ఈ లోపు మరో సినిమా చేసే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఉన్నట్టు సమాచారం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS