Director Trivikram Srinivas doing a movie with Young Tiger NTR. This movie is caught in many rumours. In this situation, Trivikram given clarity about all the gossips which rounding in film nagar.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోయే చిత్రంపై సూపర్ క్రేజ్ నెలకొన్నది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టగా ప్రారంభమైన ఈ చిత్రంపై అనేక రూమర్లు ఫిలిం సర్కిళ్లలో షికారు చేస్తున్నాయి. అయితే ఇటీవల ఆ చిత్రంపై వస్తున్న అన్ని రకాల గాసిప్స్‌కు త్రివిక్రమ్ తెరదించారు. మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలో ఎలాంటి వాస్తవం లేదు అని ఆయన క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం.
ఈ మధ్య నితిన్, సమంతతో తీసిన ఆ ఆ చిత్రం కొంత వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత్రి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం నిర్మించారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత త్రివిక్రమ్ స్పందించి ఆ రచయిత్రికి క్రెడిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
సరిగ్గా ఆ ఆ చిత్రానికి సంబంధించిన వార్త మాదిరిగానే తాజాగా మరో వార్త తెరమీదకు వచ్చింది. 80 దశకంలో బాగా పాపులర్ అయిన ఓ నవలను భారీ మొత్తాన్ని చెల్లించి హక్కులను సొంతం చేసుకొన్నాడు అనే వార్త వైరల్‌గా మారింది. దాంతో త్రివిక్రమ్ తన సన్నిహితుల వద్ద స్పందించాల్సి వచ్చిందట.