Revanth Reddy Viral Speech About KCR @ Aatmiyulu Maata Muchata. Revanth Reddy lashed out at cm kcr at Aatmiyulu Maata Muchata meeting. he scolding cm kcr in hard manner.
తెలంగాణలో నిరుద్యోగ యువత కోసం కెసిఆర్ ఒక్క క్షణం కూడ ఆలోచించలేదని రేవంత్ ఆరోపణలు గుప్పించారు.ఎన్నికల్లో ఇచ్చిన హమీలను కెసిఆర్ అమలు చేయలేదని రేవంత్ ఆరోపణలు చేశారు. 14 ఏళ్ళ ఉద్యమంలో ఏనాడూ చెప్పని విషయాలను 40 నెలల కాలంలో అమలు చేస్తున్నారని కెసిఆర్‌పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కనీసం ఈ హమీలను అమలు చేయకుండా వ్యాపారాలు, టీవీ ఛానెల్, పేపర్ పెట్టారని రేవంత్ సీఎం పై విమర్శలు గుప్పించారు. తన కొడుకు కోసం కొత్త సెక్రటేరియట్ కట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. తన కుటుంబ సభ్యుల విలాస జీవితం కోసం లక్షల కోట్లను ప్రభుత్వ ధనం వినియోగిస్తున్నారని రేవంత్ ఆరోపణలు చేశారు.. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామాకాలు లేవని రేవంత్‌రెడ్డి చెప్పారు.తెలంగాణలో టిఆర్ఎస్‌తోనే బిజెపి నేతలు అంటకాగుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు టిఆర్ఎస్ బిజెపి అనుకూలంగా వ్యవహరించిన విషయాన్ని రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. బిజెపికి చెందిన కొందరు కీలక నేతలు ఈ విషయాన్ని తనతో ప్రస్తావించారని చెప్పారు. తెలంగాణ టిడిపిలో లేదని బిజెపి నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆయన చెప్పారు. టిడిపితో పొత్తు వద్దని కెసిఆర్‌తో స్నేహహస్తాన్ని బిజెపి నేతలు కోరుకొన్నారని రేవంత్ ఆరోపణలు చేశారు.