Two persons, Rakesh and Kavitha arrested fr cheating on the name of jobs in Mero rail project of Hyderabad.
హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్‌లో ఉద్యోగాలంటూ అమాయకులను మోసం చేస్తున్న ప్రధాన నిందితుడు, అతని సహకరిస్తున్న నిందితురాలిని తెలంగాణలోని రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ మహేష్ భగవత్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రైల్ విభాగంలో వివిధ క్యాటగిరీలకు సంబంధించిన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయంటూ నాగోల్‌కు చెందిన పి.శ్రీకాంత్ వాట్సాఫ్‌కు ఒక మేసేజ్ వచ్చింది.