రూ.100 కోట్ల అవి'నీటి' తిమింగలం! - కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ అరెస్ట్

ETVBHARAT 2025-04-27

Views 1

acb officials arrested enc hariram : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో ముఖ్య భూమిక పోషించిన నీటి పారుదల శాఖ గజ్వేల్‌ ఈఎన్‌సీ భుక్యా హరిరామ్‌ను అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాల నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి సోదాలు చేపట్టిన ఏసీబీ, సాయంత్రం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం రాత్రి వరకూ గుర్తించిన అక్రమాస్తుల విలువ సుమారు రూ.100 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నందున మరిన్ని అక్రమాస్తులు బయటపడే అవకాశముందని, అక్రమాస్తుల వాస్తవ విలువ భారీగా ఉంటుందని ఏసీబీ వివరించింది.

Share This Video


Download

  
Report form