Mohan Babu Vs Manchu Manoj Case Update : మా నాన్నను అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారని.. ఆయన దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారని నటుడు మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులుపై దాడి చేసిన నటుడు మోహన్ బాబు, అన్న మంచు విష్ణు తరపున మంచు మనోజ్ క్షమాపణలు చెప్పారు. ఆయన మీడియాపై చేసిన దాడిని మనోజ్ ఖండించారు. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదన్నారు. జర్నలిస్టులకు తానేప్పుడు తోడుంటానన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన తన కోసం వచ్చిన మీడియాకు ఇలా జరగడం చాలా బాధకరం అన్నారు. మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. జన్పల్లి నివాసం నుంచి రాచకొండ సీపీ కార్యాలయానికి బయలుదేరుతూ ఆయన మీడియాతో మాట్లాడారు.