గాడిద పాల వ్యాపారం పేరుతో రూ.100 కోట్లు లూటీ! - లబోదిబోమంటున్న బాధితులు

etvbharat 2024-11-15

Views 0

ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా గాడిద పాల గురించి విస్తృతంగా చర్చ సాగుతుంది. మార్కెట్లో హైప్‌, డిమాండ్ ఆసరాగా తీసుకుని తమిళనాడుకు చెందిన ఓ ముఠా గాడిదల పెంపకం, పాల ఉత్పత్తి, లాభాల పేరిట ఆశ చూసి ఔత్సాహిక రైతులను నమ్మించి మోసం చేసింది. తాజాగా తెలుగు రాష్ట్రాలో గాడిద పాల కుంభకోణం వెలుగు చూసింది.

ఫ్రాంచైజీ మోడల్‌లో గాడిద పాలు ఉత్పత్తి చేసిన తమ పాలు తీసుకుని ఓ సంస్థ దాదాపు రూ.100 కోట్లు ఎగవేసిందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన గాడిద పాల ఉత్పత్తిదారులు, ఔత్సాహిక యువకులు, మహిళలు తమ గోడ వెల్లబోసుకున్నారు. చెన్నైలో డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూపు సభ్యులు తమను నమ్మించి నిలువునా మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS