త్వరలో టీడీపీలో చేరతా' చంద్రబాబును కలిసిన తీగల

ETVBHARAT 2024-10-07

Views 1

TG Ex MLA Teegala krishna Reddy Join In TDP : త్వరలో టీడీపీలో చేరతానని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలిపారు. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో తీగల కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, టీడీపీ వల్లే హైదరాబాద్‌ అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణలో టీడీపీ అభిమానులు చాలా మంది ఉన్నారని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు, ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి కలిశారు. తన మనవరాలి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించినట్లు మల్లారెడ్డి తెలిపారు.

Share This Video


Download

  
Report form