Alleti on MLAs Disqualification : పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకీ చెంపపెట్టు లాంటిదన్నారు. ఓవైసీ, ముఖ్యమంత్రి సోదరుడి బిల్డింగ్‌లను కూల్చలేక హైడ్రా కోరలు పీకేస్తున్నారని దయ్యబట్టారు. హైడ్రా ఆరంభ శూరత్వం అయ్యిందని ఎద్దేవా చేశారు