Khairatabad Ganesh 2024 : గణపతి నవరాత్రి ఉత్సవాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడు. ఈసారీ సప్తముఖ మహాశక్తి గణపతిగా కొలువుదీరాడు. విగ్రహం ప్రతిష్ఠంచి 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ దఫా 70 అడుగులతో భారీ గణనాథున్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తొలి పూజ చేసిన అనంతరం సామాన్య భక్తుల దర్శనానికి అనుమతించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సైతం బడా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 రోజులపాటు మహా గణపతి భక్తులకు దర్శనమివ్వనున్నారు.