Telangana SDRF Funds 2024 : ఇటీవలె ప్రకృతి విపత్తుకు సంబంధించి రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎలాంటి అధికారిక నివేదిక అందలేదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోంశాఖకు రోజువారీ నివేదిక పంపేలా అధికారులకు సూచనలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఈ మేరకు ఈ నెల 3 న రాసిన రెండు పేజీల లేఖ బుధవారం బయటకొచ్చింది.