తెలంగాణ పోలీసు అకాడమీ మహిళా పోలీసులకు శిక్షణ భేష్

ETVBHARAT 2024-08-16

Views 6

Telangana State Police Academy : లాల్‌బహుదూర్‌ వెంకటరామిరెడ్డి తెలంగాణ పోలీసు అకాడమీ. 150 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ శిక్షణ కేంద్రాన్ని1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్‌.టి. రామరావు ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడమీగా ఉన్న ఈ కేంద్రం విభజన తర్వాత తెలంగాణ పోలీసు అకాడమీగా మారింది.

ఈ తెలంగాణ పోలీసు అకాడమీలో ఎస్సై ఆపై స్థాయి అంటే గ్రూప్‌-1 ద్వారా ఎంపికైన డీఎస్పీలకు శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం అకాడమీలో 2023కు బ్యాచ్‌కు చెందిన 535మంది సబ్‌ ఇన్స్‌పెక్టర్లకు శిక్షణ కొనసాగుతోంది. వీరిలో 401 సివిల్‌, 29మంది స్పెషల్‌ పోలీసు, 71మంది ఆర్మ్‌డ్‌ రిజర్వు, 12 మంది ఎస్పీఎఫ్‌, 22 మంది ఐటీ కమ్యూనికేషన్‌తోపాటు మరో 9 మంది ఫింగర్‌ ప్రింట్‌, 3గురు ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులకు శిక్షణ కొనసాగుతోంది.

Share This Video


Download

  
Report form