Ongole Mayor and 12 Corporators Resigned to YCP : ఒంగోలులో వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేయర్ సుజాతతోపాటు 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. నాయుడుపాలెంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇటీవలే విశాఖలో వైఎస్సార్సీపీకి చెందిన కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరారు. ఇప్పటికే అధికారం కోల్పోయి అధఃపాతాళానికి పడిపోయిన జగన్‌కు కార్పొరేటర్లు వరుసగా పార్టీని వీడుతుండటం తలనొప్పిగా మారింది.