Doodh Bowli Well In Karimnagar: ఆ బావిలో ఊరేదినీళ్లే కానీ.! చూడడానికి పాలవలే తెల్లగా ఉంటాయి. ఆ నీళ్లకు తగ్గట్లుగానే పెట్టారేమో దూద్‌బావి అనిపేరు కరీంనగర్ జిల్లా మొలంగూరు గ్రామంలో ఉంది ఆ బావి. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆ ప్రాచీనకట్టడం. మొలంగూరు కోటగుమ్మంలో ఉన్న దూద్‌బావిలోకి ఊటగా వచ్చే నీళ్లు ఎంతో శ్రేష్ఠంగా ఉంటాయి. పరిసర గ్రామాల ప్రజలు ఎన్నోఏళ్లుగా ఆ బావి నీళ్లు సేవించే ఆరోగ్యంగా ఉన్నామని చెబుతున్నారు. ప్రకృతి సిద్ధమైన దూద్‌బావి నీరు స్వచ్ఛంగా, శ్రేష్ఠంగా ఉన్నాయని ఇటీవల భూగర్భ జలశాఖ అధికారులు నిర్వహించిన పరీక్షల్లోనూ తేలింది.