IAS Officer Sridevi Transfer : వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి శ్రీదేవిని ప్రభుత్వం ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ చేసింది. ఆమెను ఆ పోస్టు నుంచి తప్పించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. శ్రీదేవి బాధ్యతలు చేపట్టాక వాణిజ్య పన్నుల రూపంలో వసూళ్లు పెరిగాయి. కానీ ప్రభుత్వం ఆమెపై బదిలీ వేటుకు కారణాలపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.